Pawan Kalyan | పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. ఆయన ఏం చేసిన అది స్టైలే. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు, సెట్ చేస్తాడు. పవన్ సినిమాలలో ఉన్నప్పుడు ఏదైన ఫంక్షన్స్‌కి వస్తే చాలా స్టైలిష్‌గా వచ్చేవారు. కాని రాజకీయ క్షేత్రంలోకి వచ్చాక జనసేనాని వైట్ అండ్ వైట్‌తో కనిపిస్తూ ఉన్నారు. అసలు ఈ మధ్య పవన్ కళ్యాణ్‌ని షర్ట్, ప్యాంట్లో చూసిందే లేదు. కాని ఆయన విజయవాడలో ఒక సెలూన్ ఓపెనింగ్ కి రాగా, ఆ సమయంలో పాత స్టైల్‌ని అభిమానులకి గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ స్కై బ్లూ కలర్ టీ షర్ట్, బ్లాక్ షార్ట్, ఫుల్ టైట్ షూస్, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్‌తో కనిపించారు.
డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ తొలిసారి ఇలా ట్రెండీ లుక్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. సినిమాల్లో హీరోగా కనిపించేటప్పుడు కూడా ఇంతగా కనిపించలేదేమో అన్నంతగా, పవన్ లుక్ చూసినవారు ముక్కున వేలేసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. విజయవాడ, పెనమలూరు, కానూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఓ సెలూన్ షాపు ఓపెనింగ్‌కి పవన్ కళ్యాణ్ హఠాత్తుగా హాజరయ్యారు. ఆయన కాన్వాయ్‌తో రాగా,పవన్ కారులో దిగి బయటకు రావడంతో ఒక్కసారిగా అక్కడి జనసంద్రం ఆ షాపు వద్దకు చేరుకుంది.
పవన్ కళ్యాణ్ జిమ్‌కి వెళ్లి వస్తూ దారిలో సెలూన్ ఓపెనింగ్‌కి వచ్చారని అర్ధమవుతుంది. అందుకే టైట్ షర్ట్, బ్లాక్ షర్ట్‌లో మెరిసారు . అప్పటి వరకు ప్రజలు ఇది ఏదైనా సినిమా షూటింగ్ అని భావించినా, అసలైన కారణం తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గొప్ప విషయం అని పలువురు కొనియాడుతున్నారు. ఆ మధ్య పవన్‌పై పల విమర్శలు రాగా, ఇప్పుడు పవన్‌ని ఇలా చూసి విమర్శకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక షాప్ ఓపెనింగ్ అనంతరం పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ పైనుంచి అక్కడికి వచ్చిన అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయారు. ఇక పవన్ నటించిన “హరిహర వీరమల్లు” సినిమా మళ్లీ వాయిదా పడగా, త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌పై క్లారిటీ రానుంది. మరోవైపు ఓజీ షూటింగ్ కూడా పవన్ పూర్తి చేసినట్టు సమాచారం.