Pawan Kalyan |పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజున చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడడం ఎంతో బాధించింది.సింగపూర్‌లోని ఒక స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వెంటనే సింగపూర్ బయలు దేరారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని సింగపూర్ వెళ్లారు. నేటి తెల్లవారుజామున ఒంటిగంటకు సింగపూర్ బయలుదేరారు పవన్. ఈవిషయాన్ని ధ్రువీకరిస్తూ మెగా ఫ్యామిలీ పి.ఆర్. ఎయిర్ పోర్ట్ కు వస్తున్న వీడియోను విడుదల చేసింది.
నిన్న రాత్రే మీడియాముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వేసవి కేంప్ లో భాగంగా జరిగే చిన్న పిల్లల ఈవెంట్ లో నా భార్యకూడా ఉందని చెప్పారు. మార్క్ శంకర్‌ను చూసేందుకు పవన్ కళ్యాణ్‌తో పాటుగా చిరంజీవి, సురేఖ కూడా సింగపూర్‌కు బయల్దేరారు. మార్క్ శంకర్‌తో అక్కడ అన్నా లెజినోవా ఒక్కరే ఉండడంతో ఆమెకు తోడాగా, భరోసానిచ్చేందుకు సురేఖ కొణిదెల కూడా సింగపూర్ బయల్దేరారు.చిరంజీవి తన షూటింగ్‌లను క్యాన్సిల్ చేసుకొని సింగపూర్ వెళ్లారు. వారు తిరిగి ఎప్పుడు వస్తారు అన్నదానిపై క్లారిటీ లేదు. మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్లను కూడా అక్కడి హాస్పిటల్ టీం బయటకు చెప్పడం లేదు. త్వరలోనే మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్లను అధికారింగా విడుదల చేయనున్నట్టు సమాచారం..
అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలుకాగా..ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో చాలా మంది పిల్లలున్నారు. అందులో కొందరికి వీపు, కాలు, చేతులు కాలాయి. పొగవల్ల ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఏర్పడింది. దురదృష్టవశాత్తు మా పిల్లాడి పక్కనే ఉన్న చిన్నపాప చనిపోయింది.అందుకు నాకు చాలా బాధగా ఉందని పవన్ ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఇక మార్క్ శంకర్ కోలుకోవాలని, పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉండాలి పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్, కేటీఆర్, బండి సంజయ్, వైఎస్ జగన్ వంటి వారంతా కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే.
Kalyan garu Chiranjeevi garu ,Surekha amma garu on the way to Singapore pic.twitter.com/BC6YjZYUGp
— SivaCherry (@sivacherry9) April 8, 2025