Pawan kalyan | ఖండాంతరాల్లో ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఓజీ సినిమా హిట్టవ్వాలని గణనాథుడిని వేడుకుంటూ లడ్డూ వేలం పాటలో పాల్గొన్నారు. అమెరికాలోని సియాటెల్‌లో పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో 11 రోజులపాటు వినాయకచవితి ఉత్సవాలు గ్రాండ్‌గా ముగిశాయి. ఈ సందర్భంగా 11 రోజులపాటు పూజలందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు వారంతా వేలం పాటలో పాల్గొని.. రూ.3 లక్షలకు గణపయ్య లడ్డూను సొంతం చేసుకున్నారు.
అనంతరం ఆ లడ్డూను భక్తులకు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ లడ్డూ వేలంపాటలో పాల్గొన్నట్టు ఈ సందర్భంగా అశోక్ గల్లా తెలిపారు. లడ్డూ వేలంలో వచ్చిన మొత్తాన్ని సియాటెల్ క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా అందిస్తామని వినాయక ఉత్సవాలను నిర్వహించిన నాసా సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
లడ్డూ వేలం పాటలో జనార్దన్ చక్కా, అశోక్ పసుపులేటి, లక్ష్మీనారాయణ, నవీన్ గంధం, సతీశ్ బత్తిన, నాసా సంస్థ ప్రతినిధులు వినోద్ పర్ణ, సుహాగ్ గండికోట, నితీశ్, నరేంద్రతోపాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. 11 రోజులుగా ప్రతీ రోజూ సాయంత్రం 5 వందల మందికిపైగా భక్తులకు గణపయ్య మహాప్రసాదం పంచినట్టు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
Kanchana 4 | హార్రర్ ప్రాంచైజీ కాంచన 4 వచ్చేస్తుంది.. రాఘవా లారెన్స్ టీం క్రేజీ న్యూస్..!
Pawan Kalyan | తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ అవుతుంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్