Pawan Kalyan | మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 47 ఏళ్లు పూర్తైంది. 1978లో విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన చిరు, ఆ తరువాత తన అద్భుతమైన నటనతో, కష్టపడి సాధించిన విజయాలతో లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో భావోద్వేగపూర్వకంగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఆయన చేసిన పోస్ట్‌పై తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
నా పెద్దన్నయ్య పుట్టుకతోనే ఒక ఫైటర్. ఆయనకు రిటైర్మెంట్ అనే మాటే లేదు. ప్రాణం ఖరీదు సినిమా చూసిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. మా అన్నయ్య ఎంత ఎదిగినా, ఆయన వినయాన్ని, ఇతరులకు అండగా నిలిచే గుణాన్ని ఎప్పటికీ కోల్పోలేదు అంటూ పవన్ కళ్యాణ్ అన్నయ్యపై తన అనుబంధాన్ని వ్యక్తపరిచారు. అలాగే, చిరంజీవి సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని విజయాలు సాధించాలని దుర్గా మాతను ప్రార్థించారు. దీనికి చిరంజీవి స్పందిస్తూ, డియర్ కళ్యాణ్ బాబు, నీ మాటలు నా మనసును తాకాయి. నన్ను బిగినింగ్ డేస్‌కి తీసుకెళ్లాయి అని అన్నారు.
ప్రాణం ఖరీదు నుంచి ఇప్పటి వరకు నాకు లభించిన అభిమానుల ప్రేమ, కుటుంబం, స్నేహితుల ప్రోత్సాహానికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. నీకు దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓజీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. టీం అందరికీ శుభాకాంక్షలు” అని ఎక్స్‌లో రాసుకొచ్చారు మెగాస్టార్. చిరంజీవి తన పోస్ట్‌లో, “22 సెప్టెంబర్ 1978 నుంచి నేటి వరకు 155 సినిమాలు పూర్తి చేయడం.. అనేక అవార్డులు అందుకోవడం.. ఇవన్నీ నా అభిమానుల ఆశీస్సుల ఫలితం. ఈ ప్రేమానుబంధం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్‌గా రాశారు. కాగా, చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినా, ముందుగా విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ చిత్రమే ఆయనకు ‘చిరంజీవి’ అనే పేరు తెచ్చి, సినీ కెరీర్‌కు బలమైన పునాది వేసింది.
Dear Kalyan Babu,
Your words touched me deeply and took me back to those early days.
From ‘𝓹𝓻𝓪𝓷𝓪𝓶 𝓴𝓱𝓪𝓻𝓮𝓮𝓭𝓾’ to this day, I have always cherished the love and encouragement of our family, friends, fans, and audience. Thank you very much for everything. May the… https://t.co/VQ7Ut69kNr
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025