పవన్ కళ్యాణ్ ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా చేసిన సినిమా ఏదో తెలుసా..?
విడుదలయిన తరువాత చివరికి పవన్ కళ్యాణ్ అంచనాలు నిజమయ్యాయి. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి చెప్పాడు.

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటి వరకు 26 సినిమాలు చేశాడు. అందులో సగం విజయాలు ఉంటే.. సగం పరాజయాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందుగానే తెలిసి ఎవరు ఏ సినిమాకు కమిట్ అవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కెరీర్లో ఒక సినిమాను అలాగే చేశాడు. ఆ కథ చెప్పినప్పుడు అది ఫ్లాప్ అవుతుందని అంచనా వేశాడు. కానీ దర్శక నిర్మాతలు కన్విన్స్ చేసి సినిమా చేయించారు. అయితే విడుదలయిన తరువాత చివరికి పవన్ కళ్యాణ్ అంచనాలు నిజమయ్యాయి. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ విషయాన్ని పవన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి చెప్పాడు. ఆయన చెప్పిన సినిమా ఏదో కాదు.. బంగారం.

2006లో విడుదలైన ఈ సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా దారుణంగా నిరాశ పరిచింది. తమిళ దర్శకుడు ధరణి తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. దానికి తోడు సరిగ్గా వారం ముందు పోకిరి సినిమా విడుదల కావడం.. అది బ్లాక్ బస్టర్ కావడంతో బంగారం సినిమా అడ్రస్ గల్లంతు అయిపోయింది. ఫ్యాక్షనిజం బాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా బయ్యర్లకు స్వల్ప నష్టాలు మిగిల్చింది. అయితే ఈ కథ చెప్పినప్పుడు వర్కౌట్ కాదని దర్శకుడు ధరణికి పవన్ చెప్పినట్లు ఆనంద్ సాయి తెలిపాడు. అయితే ఆయన చేతులు పట్టుకొని నన్ను నమ్మి సినిమా చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ ముందడుగు వేశాడని తెలిపారు.

కానీ చివరికి పవన్ జడ్జిమెంట్ నిజమైందని ఆనంద్ సాయి తెలిపారు. ఆ సినిమా ముందు నుంచి కూడా ఆడదు అనే ఉద్దేశంతోనే పవన్ ఉన్నాడని.. విడుదల తర్వాత అదే రిజల్ట్ వచ్చిందని చెప్పాడు. అంతేకాదు ప్రతి సారి తన సినిమాలకు విలువైన ఇన్ పుట్స్ ఇస్తుంటారు పవన్. బంగారం సినిమాకు అది కూడా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో ఆయనకు హీరోయిన్ కూడా ఉండదు. దానికి తోడు క్లైమాక్స్ కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. దీంతో బంగారం సినిమా విడుదలైనప్పుడు పవన్ అభిమానులు కూడా కాస్త నిరాశ పడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జాతిరత్నం హీరోయిన్ గ్లామర్ పిక్స్.. వైరల్
నాగబాబు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా?
ప్రముఖ నటుడి భార్య ఆత్మహత్య.. కట్నం కోసం వేధించాడని ఆరోపణలు
రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్‌కు బైబై చెప్పాలంటూ సూచన!
విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా
మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్
నటి సోదరుడు, ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
కెరీర్ కోసం ప్రేయసికి దూరంగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్న సల్మాన్ ఖాన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

