నాగబాబు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా?
పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు. మరో మూడేళ్ల వరకూ ఆయన చాలా సినిమాలు ఒప్పుకున్నాడు. అప్పటివరకు బిజీగానే ఉంటాడు.

పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు. మరో మూడేళ్ల వరకూ ఆయన చాలా సినిమాలు ఒప్పుకున్నాడు. అప్పటివరకు బిజీగానే ఉంటాడు. ప్రస్తుతం కరోనా కారణంగా కాస్త బ్రేక్ తీసుకున్నారు కానీ లేదంటే బ్రేక్ లేకుండా షూటింగ్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది వకీల్ సాబ్ విడుదల చేశాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న అయ్యప్పనుం కొశీయుమ్ రీమేక్ కూడా ఇదే ఏడాది విడుదల కానుందని తెలుస్తోంది. దాంతో పాటు హరీష్ శంకర్ సినిమా అలాగే ఉంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సంక్రాంతికి విడుదల అవుతుందని నిర్మాత ఏఎం రత్నం మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఇదంతా ఇలా ఉంటే నాగబాబు నిర్మాతగా కూడా పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

తనతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటాడు పవన్ కళ్యాణ్. అప్పట్లో తీన్మార్ ఫెయిల్ అయిందని వెంటనే తన నిర్మాణంలో చేయాలనుకున్న గబ్బర్ సింగ్ సినిమాను బండ్ల గణేష్‌కు ఇచ్చి ఆయనను ఆదుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కేవలం అప్పులు తీర్చడానికి చేశామంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు పవన్. తన అన్నయ్య నాగబాబు ఆరెంజ్ సినిమా తీసి ఘోరంగా నష్టపోతే అప్పులు తాను తీరుస్తానని కమిట్ అయ్యానని.. అందుకే గబ్బర్ సింగ్ సినిమా చేశానని అప్పట్లో చెప్పాడు. నాగబాబు నిర్మాణంలో వచ్చిన గుడుంబా శంకర్ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఆ సమయంలో మీకు మరో సినిమా చేస్తా అన్నయ్య అంటూ అప్పట్లో పవన్ మాట ఇచ్చాడని.. దాన్ని ఇప్పుడు నిలబెట్టుకోవాలని చూస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాత నాగబాబు నిర్మాణంలో సినిమా చేయనున్నాడు పవర్‌స్టార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జాతిరత్నం హీరోయిన్ గ్లామర్ పిక్స్.. వైరల్
ప్రముఖ నటుడి భార్య ఆత్మహత్య.. కట్నం కోసం వేధించాడని ఆరోపణలు
రాధేతో నిరాశపరచిన ప్రభుదేవా..డైరెక్షన్‌కు బైబై చెప్పాలంటూ సూచన!
విష్ణు ప్రియ గ్లామర్ షో.. యువత ఫిదా
మిస్ కాల్ ఇస్తే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ మీ ముందుంటుంది: సోనూసూద్
నటి సోదరుడు, ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
కెరీర్ కోసం ప్రేయసికి దూరంగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్న సల్మాన్ ఖాన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

