పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటారు. ఓ సెలబ్రిటీ అన్న విషయం కూడా మరచిపోయి నిరాడంబరమైన జీవితం గడుపుతుంటారు. హంగులు,ఆర్భాటాలు అతనికి ఏ మాత్రం నచ్చవు. బంగ్లాలలో కన్నా పచ్చని ప్రకృతి మధ్య ఉండడానికే పవన్ ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే కార్లపై కూడా పెద్దగా ఆసక్తి చూపని పవన్ తాజాగా ఓ లగ్జీరియస్ ఎస్యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ కారుని బుక్ చేశారట.దీని ఖరీదు 4 కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాక్.
టాలీవుడ్ సెలబ్రిటీలలో కొందరికి మాత్రమే ఇలాంటి లగ్జరీ కారు ఉండగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వారి జాబితాలో చేరాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ దూరం ప్రయాణాలకి ఇది సౌకర్యవంతంగా ఉంటుందని కాస్ట్ లీ కారు కొనుగోలు చేశారట. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇటీవల కరోనా నుండి కోలుకున్న ప్రస్తుతం హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.