Priya Marathe | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ టెలివిజన్ షో ‘పవిత్ర రిస్తా’ ఫేమ్ నటి ప్రియా మరాఠే (38) తుదిశ్వాస విడిచారు. ముంబయిలని మీరా రోడ్‌లోని తన ఇంట్లో ఆమె కన్నుమూశారు. నటి మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె మృతిపై పలువురు విచారం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా షాకింగ్ వార్త. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఓ యూజర్ రాశారు. ‘పవిత్ర రిస్తా’ సీరియల్లో ఆమె వర్ష పాత్రను పోషించారు. ప్రియా మాత్రమే పలు మరాఠీ సీరియల్స్‌తో పాటు చిత్రాల్లోనూ నటించారు.
పలు హిందీ టెలివిజన్ షోల్లో కూడా పాల్గొంది. ఇందులో ‘పవిత్ర రిస్తా’లో వర్ష పాత్రతో అభిమానులకు దగ్గరైంది. ఈ సీరియల్లో నటి అంకితా లోఖండే సోదరి పాత్రను పోషించింది. ఈ సీరియల్లో సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ కూడా నటించిన విషయం తెలిసిందే. అలాగే, ‘చార్ దివాస్ ససుచే, కసమ్ సే, కామెడీ సర్కస్ కే సూపర్ స్టార్స్, ఉత్తరన్, బడే అచ్చే లగ్తే హై, భారత్ కా వీర్ పుత్ర మహారాణా ప్రతాప్, సావధాన్ ఇండియా, భాగే రే మన్ వంటి షోలలో నటించింది. 2012 ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా.. ఇప్పటి వరకు 20పైగా షోలతో పాటు రెండు చిత్రాల్లో నటించారు. మె చేసిన పాత్రలన్నీ చాలా సహజంగా ఉంటాయి. ఆమె తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు.
ప్రియా మరాఠే 1987 ఏప్రిల్ 23న ముంబయిలో పుట్టింది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. మరాఠీ టీవీ షో ‘యా సుఖనోయ’ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో ‘పవిత్ర రిస్తా’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రియా చివరిసారిగా మరాఠీ సీరియల్ ‘తుజెచ్ మి గీత్ గాత్ ఆహే’లో నటించింది. ప్రియా 2012లో నటుడు శంతను మోఘేను వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు భారీగా ఫాలో అవర్స్ ఉన్నారు. అయితే, ఆగస్టు 11, 2024న పోస్ట్ చేసింది. నటి తన భర్తతో జైపూర్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది. అయితే, గత కొంతకాలంగా ఆమె కాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త విని అభిమానులతో పాటు తోటి నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతికి ప్రగాడ సానుభూతి తెలిపారు.