Pathaan Movie Trailer | షారుఖ్ సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు అయింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. మధ్యలో రెండు, మూడు సినిమాల్లో మెరిసినా అవి ఫ్యాన్స్‌కు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఇక షారుఖ్‌ను ఫుల్ లెంగ్త్ రోల్లో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా షారుఖ్ కూడా ఈ నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘పఠాన్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది.
ఎప్పుడెప్పుడా అని షారుఖ్ అభిమానులు ఎదురుచూస్తున్న పఠాన్ ట్రైలర్‌ను జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక ‘భేషరమ్ రంగ్’ పాట వివాదంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా జనవరి 26న హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
#PathaanTrailer on 10 Jan 2023… #Pathaan [NO title change] arrives in *cinemas* on 25 Jan 2023 [#RepublicDay weekend] in #Hindi, #Tamil and #Telugu. pic.twitter.com/AbYCRn2W7s
— taran adarsh (@taran_adarsh) January 4, 2023