Parineeti -Raghav | బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఎంగేజ్మెంట్ ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థ వేడుక ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో ఈనెల 13వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా, వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ప్రోమో (Engagement Promo) వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. వీడియోలో కాబోయే కొత్త జంట ఎంతో రొమాంటిక్‌గా కనిపించారు. ఇరు కుటుంబసభ్యులు నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా, నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, చిత్ర పరిశ్రమలోని సహచరులు హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పరిణీతి సోదరి ప్రియాంకా చోప్రా తదితరులు హాజరై కాబోయే కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో రాఘవ్-పరిణీతిలు వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Viral Video | బైక్‌లో పెట్రోల్ పోస్తుండగా లైటర్ వెలిగించిన యువకుడు.. వీడియో వైరల్
Kerala State Lotteri | కేరళ లాటరీ డ్రా.. రూ.12 కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి