అరవైనాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి. వస్తువునైనా కావొచ్చు, మనిషినైనా కావొచ్చు. అపహరిస్తే అది కళే. ఇదే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అనేది ఉపశీర్షిక. చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రధారులు. సంతోశ్ కంభంపాటి దర్శకుడు. మహేందర్‌రెడ్డి, దినేష్ నిర్మాతలు.
హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కతున్న ఈ చిత్రం టైటిల్ లుక్ పోస్టర్ని సోమవారం మేకర్స్ విడుదల చేశారు. పాత్రధారులంతా విభిన్నమైన లుక్స్‌తో కనిపిస్తున్నారని, త్వరలోనే కాన్సెప్ట్ టీజర్‌ని కూడా విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖావాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసరస్వతి, సంగీతం: ‘రీ’.