Cinema News | తోబుట్టువుల పాత్ర అనగానే బాలీవుడ్లో చాలా మందికి గుర్తుకువచ్చేది అపర్శక్తి ఖురానానే. ఆయనతో కలిసి వాణి కపూర్ నటించనున్న సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. నిక్కీ విక్కీ భగ్నాని ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కనుందీ చిత్రం. పరేష్ రావల్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను నిక్కీ భగ్నానీ, విక్కీ భగ్నానీ నిర్మించనున్నారు.
ఆధునిక కాలంలో బంధాలు బంధుత్వాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నది. మనుషుల మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారిపోతున్న తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. కుటుంబ కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో వాణి కపూర్, అపర్శక్తి తోబుట్టువులుగా కనిపించనున్నారు. వాణి కపూర్ నటించిన ‘రైడ్2’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్ 15న విడుదల కానున్న ఈ సినిమాలో వాణి కపూర్ అజయ్ దేవగన్‌కు జోడీగా కనిపించనున్నారు.