Pankaj Tripathi | బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంకజ్ బావ రాకేష్ తివారీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. సోదరి సరితకు తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకెళితే.. భార్యతో కలిసి ప్రత్యేక వాహానంలో బిహార్ నుంచి పశ్చిమ బెంగాల్ బయలుదేరాడు రాకేష్. దిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై వారు వేగంగా ప్రయాణిస్తుండగా.. అది చౌరస్తా కూడలి దగ్గర అదుపులోకి రాలేదు. దీంతో ఆయన కారు వేగంగా వెళ్లి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ధన్బాద్లోని ఆస్పత్రికి తరలించారు. రాకేశ్ తివారీని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్దారించారు. పంకజ్ త్రిపాఠి సోదరి సరితకు కాలు విరిగిందని ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.