స్మైల్ శ్రీను దర్శకత్వంలో పద్మశ్రీ పిక్చర్స్ సంస్థ తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘మైరా’. ప్రకృతికి విరుద్ధమైన పద్దతులను అవలంభిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న నేటి సమాజానికి సందేశాన్ని అందిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు స్మైల్ శ్రీను తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఓ అగ్ర కథానాయికతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నామని, ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు స్మైల్ శ్రీను తెలిపారు