Salman khan | సల్మాన్ సినిమా సెట్లో పనిచేసే మహిళలకు దుస్తుల విషయంలో ఆంక్షలు ఉంటాయని, ఒక తరహా దుస్తులను ఆయన తప్పక ధరించాలని సూచిస్తారని నటి, సహాయ దర్శకురాలు పాలక్ తివారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిందీ నటి. మహిళల భద్రత కోసమే మెడ వరకు కప్పి ఉంచే డ్రెస్ వేసుకోమని సల్మాన్ చెబుతుంటారని పాలక్ తివారీ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ…‘సల్మాన్ నటించిన ‘అంతిమ్’ సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేశాను. ఆ సెట్లోని మహిళలు సంప్రదాయంగా ఉండే దుస్తులు ధరించాలని సల్మాన్ చెప్పేవారు.
అపరిచిత వ్యక్తుల మధ్య పనిచేస్తున్న మహిళల భద్రత కోసమే ఆయన ఆ మాట అనేవారు. కానీ నేను చెప్పిన విషయాలు సల్మాన్ను అపార్థం చేసుకునేలా అన్వయించుకున్నారు. తన సినిమా షూటింగ్లో ఉండే మహిళలు క్షేమంగా ఉండాలనేదే ఆయన ఆలోచన. నేను సల్మాన్ షూటింగ్కు వెళ్తున్నప్పుడు మా అమ్మ పిలిచి ఇలా పద్ధతిగా దుస్తులు ధరిస్తే బాగున్నావంది. తన షూటింగ్లో ఇలాంటి నియమం పెట్టిన సల్మాన్ను అభినందించింది’ అని చెప్పింది.