Pakka commercial | మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం పక్కాకమర్షియల్. అల్లు అరవింద్ సమర్పణలో యూవీక్రియేషన్స్- గీతాఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీవాస్, ఎస్కేయన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు,టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి.ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదలచేశారు. పూర్తి పాటను ఫిబ్రవరి2 న విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.
పక్కా పక్కా పక్కా కమర్షియల్ అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రీ గారు రాశారు. సిరివెన్నెల కలం నుండి జాలు వారిన మరో అక్షరమాల అంటూ సాంగ్ ప్రోమోలో జత చేశారు. జేక్స్ బేజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సాధారణంగా మారుతి సినిమాలంటే హస్యంతో పాటు మంచి మేసేజ్ కూడా ఉంటుంది. మరి పక్కా కమర్షియల్ లో ఎలాంటి మెసేజ్ ను చెప్పబోతున్నాడో చూడాలి మరి.
Here's the title song glimpse of #PakkaCommercial, Full song out on Feb 2nd!🕺
— UV Creations (@UV_Creations) January 31, 2022
– https://t.co/KS6Zwo2Yt2
Lyrics #SirivennelaSeetharamaSastry garu📝
A @JxBe Musical🎶#AlluAravind @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas #KarmChawla @SKNonline @adityamusic pic.twitter.com/1dgDkm6Uxq