Joyland | వివాదాస్పద ఉర్దూ సినిమా జాయ్‌లాండ్ (Joyland). ఉర్దూ, పంజాబీ లాంగ్వేజ్ పాకిస్థానీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అలీ జునెజో, రస్తి ఫరూ, అలినా ఖాన్, సార్వత్ గిలానీ, సల్మాన్ పీర్జాదా కీలక పాత్రల్లో నటించారు. పాకిస్థాన్‌లో నిషేధించబడ్డ ఈ చిత్రం ఫైనల్‌గా భారత్‌లో విడుదలకు రెడీ అయింది. సయిమ్ సాదిక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 10 నుంచి భారత్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఆస్కార్ నామినేటెడ్ మూవీ STREAMలో విడుదల కానున్నట్టు పాపులర్ టికెట్ సెల్లింగ్ ప్లాట్‌ఫాం బుక్‌మైషో ప్రకటించింది. అయితే ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించాలంటే రూ.179 (అద్దె) చెల్లించాలి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కానుంది. లాహోర్‌లోని జాయ్ లాండ్ సెంటర్స్‌లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన రానా అనే వ్యక్తి కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కింది.
ఈ కుటుంబంలో పెద్దవాడైన అమానుల్లా చిన్న కుమారుడు హైదర్‌కు ట్రాన్స్ జెండర్ డ్యాన్సర్ బీబీ ఖాన్‌తో స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే నేపథ్యంలో సాగుతుంది. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్-2022లో ప్రీమియర్ అయిన తొలి పాకిస్తానీ సినిమాగా నిలిచింది జాయ్ లాండ్.
Joyland2