ప్రవీణ్‌రాజ్‌కుమార్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘పద్మహ్యూహంలో చక్రధారి’. అషురెడ్డి కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకుడు. కె.ఓ.రామరాజు నిర్మాత. ఈ చిత్రం టైటిల్ లాంచ్ ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకులు వీరశంకర్, శ్రీరామ్ ఆదిత్య, కృష్ణచైతన్య చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘ ఫస్ట్‌లవ్‌లో ఫెయిల్ అయిన వ్యక్తి ఆ వేదన నుంచి ఎలా బయటపడ్డాడు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. ఇందులో నా పాత్ర ప్రేక్షకులకు కొన్నేళ్లపాటు గుర్తుండిపోతుంది. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది’ అని హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్ అన్నారు. రాయలసీమ అనగానే ఇన్నాళ్లూ ఫ్యాక్షన్ గొడవలే తెరపై చూశారని, సీమ ప్రజల స్వచ్ఛమైన ప్రేమను తమ సినిమాలో చూస్తారని దర్శకుడు తెలిపారు. పద్మ అనే భిన్నమైన వ్యక్తిత్వం గల అమ్మాయిగా ఇందులో కనిస్తానని అషురెడ్డి చెప్పారు.