‘చాలా మంచి ఎంటర్టైనర్ ఇది. నిర్మాతలు పాషన్‌తో ఈ సినిమా తీశారు. క్లారిటీ ఉన్న దర్శకుడు రామ్. సహ నటులంతా అద్భుతంగా నటించారు. సాంకేతికంగా కూడా సినిమా బావుంటుంది. ఈ నెల 21న విడుదల చేస్తున్నాం. అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం.’ అని హీరో రాజ్‌తరుణ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పాంచ్ మినార్’. రామ్ కుడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానున్నది.
సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రాజ్‌తరుణ్ మాట్లాడారు. పదికాలాలపాటు చెప్పుకునే కైమ్ కామెడీ సినిమా ఇది అవుతుందని, ఇంటిల్లిపాదినీ అలరించే సినిమా ఇదని, త్వరలో పెయిడ్ ప్రివ్యూస్ వేయనున్నామని అందరూ చూసి ఆనందిస్తారని నమ్మకంతో ఉన్నామని దర్శకుడు రామ్ కుడుముల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా కథానాయిక రాశీసింగ్, గోవిందరాజు, మాధవి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత వివేక్ కూచిభొట్ల చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.