చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకుడు. త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలోని ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ అనే పాటను ప్రముఖ దర్శకుడు దేవ కట్టా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సినిమా కంటెంట్ చాలా కొత్తగా ఉందన్నారు. తెలంగాణ సాహిత్యంతో వెస్ట్రన్ ైస్టెల్లో కంపోజ్ చేసిన గీతమిదని దర్శకుడు కుమారస్వామి తెలిపారు.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ ‘జనం మాట్లాడుకునే భాషలో అద్భుతమైన ఫిలాసఫీ కలబోసిన పాట ఇది. మల్లెగోడ గంగప్రసాద్ అద్భుతమైన సాహిత్యాన్నందించారు. అరుణ్ చిలువేరు క్యాచీ ట్యూన్ సమకూర్చారు’ అన్నారు. ఈ పాటలో చిన్న చిన్న పదాలతోనే ప్రేమతత్వాన్ని చెప్పే ప్రయత్నం చేశానని గీత రచయిత మల్లెగోడ గంగాప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి, సంగీతం: అరుణ్ చిలువేరు, సురేష్ బొబ్బిలి, సంభాషణలు: పెద్దింటి అశోక్‌కుమార్, రచన-దర్శకత్వం: కుమారస్వామి (అక్షర).