OTT Releases This Week | ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల లిస్ట్ వచ్చేసింది. గతవారం ఓటీటీలోకి రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్‌తో పాటు బాలీవుడ్ నుంచి కిల్ సినిమా వచ్చి ఓటీటీలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ వారం రవితేజ మిస్టర్ బచ్చన్‌తో పాటు ఆయ్, కమిటీ కుర్రోళ్లు తదితర సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇక ఆ సినిమాలు ఏ ఫ్లాట్‌ఫామ్‌లో వస్తున్నాయి అనేది చూసుకుంటే..
మిస్టర్ బచ్చన్ (Mr Bachchan Movie)
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. షాక్, మిరపకాయ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా రావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ అందుకోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది ఈ చిత్రం. ఇదిలావుంటే ఈ సినిమా విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఆయ్ (AAY)
గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆయ్ (AAY). ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అంజి కంచిపల్లి దర్శకత్వం వహించాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రూ.15 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu)
టాలీవుడ్ యువ నటులు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా వచ్చిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించగా.. నిహారిక కొణిదెల సమర్పణలో… పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 9న రిలీజై మంచి విజయం సాధించింది. ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవి విన్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఇంకా ఇవే కాకుండా.. కన్నడ యాక్షన్ మూవీ భీమా (తెలుగు) అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 2 వెబ్ సిరీస్- సెప్టెంబర్ 12 (నెట్‌ఫ్లిక్స్)
మిడ్నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్ 2 వెబ్ సిరీస్- సెప్టెంబర్ 12 (నెట్‌ఫ్లిక్స్)
కల్బరి రికార్డ్స్ (హిందీ చిత్రం)- సెప్టెంబర్ 12 (జియో సినిమా)
తలవన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 10 (సోని లివ్)
బెంచ్ లైఫ్ (వెబ్ సిరీస్)-సెప్టెంబర్ 11 (సోని లివ్)
ALso Read..
PM Modi: పారాలింపిక్ పతక విజేతలను కలుసుకున్న ప్రధాని మోదీ.. వీడియో
Python | షాకింగ్ ఘటన.. ఆవుదూడను సజీవంగా మింగేసిన కొండచిలువ
RG Kar Case | వైద్యులను చర్చలకు పిలిచిన బెంగాల్ సర్కారు.. లైవ్ టెలికాస్ట్ ప్రతిపాదన తిరస్కరణ