OTT | ప్రతి వారం కూడా సినీ ప్రియులకి థియేటర్‌తో పాటు ఓటీటీలోను కావల్సినంత వినోదం అందుతుంది. మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీకి పవర్ ఫుల్ డ్రామాలు, థ్రిల్లింగ్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలు ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ఉండటం విశేషం. ఈ వారం థియేటర్లో పెద్ద సినిమాల హంగామా అయితే పెద్దగా లేదు. ‘చౌర్య పాఠం’, ‘సారంగపాణి జాతకం’ ‘జింఖానా’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇక ఓటీటీ విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్ లో బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 23, ఎ ట్రాజెడీ ఫోర్ ట్రోల్డ్: ఫ్లైట్ 3054 (ఇంగ్లీష్) – ఏప్రిల్ 23, యూ: ది కిల్లర్ ఫైనల్ (మూవీ) – ఏప్రిల్ 24, వీక్ హీరో (ఇంగ్లీష్) – ఏప్రిల్ 25, డిటెక్టివ్ కోనాన్ (యానిమేషన్) – ఏప్రిల్ 25, హావోక్ (ఇంగ్లీష్) – ఏప్రిల్ 25, జ్యువెల్ థీఫ్: ది హైస్ట్ బిగిన్స్ (హిందీ) – ఏప్రిల్ 25 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక జియో హాట్ స్టార్‌లో చూస్తే.. ది రిహార్సల్స్ (ఇంగ్లీష్) – సీజన్ 1 – ఏప్రిల్ 21 నుండి స్ట్రీమ్ కానుండగా, స్టార్‌వార్స్: యాండిర్ (ఇంగ్లీష్) – సీజన్ 1 – ఏప్రిల్ 23 నుండి ఎల్2: ఎంపురాన్ (తెలుగు) – ఏప్రిల్ 24 నుండి స్ట్రీమ్ కానుంది.
ఇక జీ5లో అయ్యన మానే (మూవీ) – ఏప్రిల్ 25 నుండి స్ట్రీమ్ కానుంది. సోనీలివ్‌లో షిర్డీ వాలే సాయిబాబా (మూవీ) ఏప్రిల్ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి రీసెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన యాక్షన్ థ్రిల్లర్ L2 : ఎంపురాన్ జియో హాట్ స్టార్ లో ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమ్ కానుండగా, ఈ మూవీ చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియ్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ స్టార్, చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ వీర ధీర శూర ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి రానుంది. చియాన్ విక్రమ్ తో పాటు ఎస్జే సూర్య, దసరా విజయన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.