OTT This Week | ఒకవైపు కూలీ సినిమాతో పాటు వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే తాము ఏం తక్కువ తిన్నామంటూ ఓటీటీలు కూడా వరుస సినిమాలను వదులుతున్నాయి. ఒకవైపు ఇండిపెండెన్స్ డేతో పాటు, కృష్ణ అష్టమి, సండే ఇలా మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో కొందరూ ఏమో లాంగ్ వీకెండ్ వచ్చిందంటూ టూర్లు ప్లాన్ చేస్తుండగా.. మరికొందరూ కూలీ, వార్ 2 సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇంటిలోనే ఉండి ఎంటర్టైన్ అయ్యేందుకు ఈ వారం పలు వెబ్ సిరీస్‌లు సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి అవి ఏంటి అనేది చూసుకుంటే.
రూ.50లకే సితారే జమీన్ పర్
బాలీవుడ్ నటుడు, మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. పాపులర్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్(Youtube)లో కేవలం రూ.100లకే ఈ సినిమా ప్రస్తుతం పే-పర్-వ్యూ (Pay-per-view) మోడల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమాపై మరో బంఫర్ ఆఫర్‌ని ప్రకటించింది చిత్రయూనిట్. ఇండిపెండెన్స్ డే కానుకగా.. ఈ సినిమాను కేవలం రూ.50లకే అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమాను చూడాలనుకునేవారు యూట్యూబ్‌లో కేవలం రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఆఫర్ ఆగష్టు 15 నుంచి 17 వరకు ఉంటుందని తెలిపింది.
జియో హాట్‌స్టార్ ఫ్రీ
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న వినియోగదారులందరికీ తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో(Jio Hotstar Free) ఉన్న మొత్తం కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌కు ఆపరేషన్ తిరంగ (Operation Tiranga) అని పేరు పెట్టినట్లు జియో హాట్‌స్టార్ తెలిపింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు జియో హాట్‌స్టార్‌లో ఉన్న అన్ని షోలు, వెబ్ సిరీస్‌లు, రేపు ఒక్కరోజు మాత్రమే అని తెలిపింది.
ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు సినిమాలు చూసుకుంటే..
అమెజాన్ ప్రైమ్
అంధేరా (హిందీ సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
సన్‌నెక్ట్స్
గ్యాంబ్లర్స్ (మూవీ) ఆగస్టు 15
జియో హాట్ స్టార్
ఏలియన్ ఎర్త్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది.
మోజావే డైమండ్స్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
నెట్‌ఫ్లిక్స్
సారే జహాసే అచ్చా (హిందీ మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
మా (హిందీ)
రోల్ మోడల్స్ (మూవీ)
అవుట్ ల్యాండర్ (వెబ్‌సిరీస్) సీజన్ 7
సెల్ఫ్ రిలయన్స్ (మూవీ)
లవ్ ఈజ్ బ్లైండ్ యూకే (వెబ్‌సిరీస్: సీజన్2)
సాంగ్స్ ఫ్రమ్ ది హోల్ (మూవీ)
ఫిక్స్డ్ (మూవీ)
మిస్ గవర్నర్ (వెబ్‌సిరీస్:సీజన్1)
జీ5
టెహ్రాన్ (హిందీ చిత్రం) ప్రస్తుతం స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (మలయాళం) ఆగస్టు 15
సోనీలివ్
కోర్ట్ కచేరీ (హిందీ సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
బుక్ మై షో
సర్ (హిందీ సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్
‘కానిస్టేబుల్ కనకం’ (తెలుగు సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
ఎంఎక్స్ ప్లేయర్
సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషషన్ (మూవీ) స్తుతం స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.