వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బమ్ ‘బంగారుబొమ్మ’. ఎం.సి.హరి, ప్రొజాక్‌లు ఈ ఆల్బమ్ సృష్టికర్తలు. వారు ఈ ఆల్బమ్‌ను దర్శకత్వం వహించడమే కాక, రచించి, ఆలపించి, నటించారు కూడా. క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ పతాకంపై ప్రణీత్ నెకురి ఈ ఆల్బమ్‌ని నిర్మించారు. ప్రస్తుతం అందరిదృష్టినీ ఆకర్షిస్తున్న ఈ ఆల్బమ్‌లోని పాటను ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఇలాంటి ఆల్బమ్స్‌కు మంచి క్రేజ్ ఏర్పడిందని, నిర్మాత ప్రణీత్ డాక్టర్ అయ్యుండి, కళలపై ఉన్న పాషన్‌తో ఈ ఆల్బమ్ నిర్మించారని, ఈ పాటలోని లేయర్స్, కాన్సెప్ట్ అన్నీ కొత్తగా ఉన్నాయని, ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలనీ, ఇలాంటి ఆల్బమ్స్ మరిన్ని రావాలని చంద్రబోస్ ఆకాంక్షించారు.