శుభారంభం అవుతుంది
‘ఓరి దేవుడా’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు కథానాయికలు మిథిలా పాల్కర్, ఆశాభట్. తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్ ఇది. విశ్వక్సేన్ కథానాయకుడిగా అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులముందుకురానుంది.
‘ఓరి దేవుడా’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు కథానాయికలు మిథిలా పాల్కర్, ఆశాభట్. తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్ ఇది. విశ్వక్సేన్ కథానాయకుడిగా అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మిథిలా పాల్కర్ మాట్లాడుతూ ‘స్నేహం, ప్రేమ, పెళ్లి అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు అను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది.
తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దారు. నేను గతంలో వెబ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నా. ఈ సినిమా తెలుగులో నాకు శుభారంభాన్నిస్తుందన్న నమ్మకం ఉంది’ అని చెప్పింది. ఆశాభట్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను మీరా అనే అసిస్టెంట్ దర్శకురాలి పాత్రలో కనిపిస్తా. నాకు నృత్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకు అనుగుణంగానే దర్శకుడు నా పాత్రను డిజైన్ చేశారు. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు అర్థం చేసుకోవడం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

