Ooru Peru Bhairavakona | టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
కాగా చాలా రోజులకు రెండో సాంగ్ అప్డేట్ అందించారు. ఈ మూవీ సెకండ్ సింగిల్ హమ్మ హమ్మ (Humma Humma) ప్రమోషనల్ టీజర్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఫుల్ సాంగ్‌ను అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మీరంతా ప్రేమలో పడిపోయే మరో స్పెషల్ సాంగ్ హమ్మ హమ్మ వచ్చేస్తుంది.. తాజా అప్డేట్ను అందరితో షేర్ చేసుకున్నాడు సందీప్ కిషన్.
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సారి ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఆనంద్ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
రెండో సాంగ్ అప్డేట్..
Promising you yet another Special Number after #NijameneChebuthunna which you will Fall in Love With ♥️#HummaHumma
a #ShekharChandra Musical
In #RamMiryalla ‘s Voice#OoruPeruBhairavaKona
A @Dir_Vi_Anand Fantasy 🧚🏽♂️@VarshaBollamma @KavyaThapar @AKentsOfficial @HasyaMovies pic.twitter.com/zsigJiJOkg— Sundeep Kishan (@sundeepkishan) October 25, 2023
నిజమే నే చెబుతున్నా లిరికల్ సాంగ్..
గత కొన్ని నెలలుగా నా జోల పాట, మా బసవ భూమిల ప్రేమ పాట
‘ నిజమేలే చెబుతున్న జానే జాన,నిన్నే నే ప్రేమిస్తున్న ‘I actually Love you guys a lot ..your belief in me is all I have got ❤️
@Dir_Vi_Anand #ShekharChandra @sidsriram @VarshaBollamma @KavyaThapar https://t.co/zeH4DPaGsU pic.twitter.com/kp7s8qjUgE— Sundeep Kishan (@sundeepkishan) March 31, 2023