జై హనుమాన్కు శ్రీకారం
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్' చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రెండో వారాంతంలో ఈ సినిమా 200కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుందని చిత్ర బృందం ప్రకటించింది.
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రెండో వారాంతంలో ఈ సినిమా 200కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుందని చిత్ర బృందం ప్రకటించింది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ గురించి హింట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్వర్మ. తాజాగా ‘జై హనుమాన్’కు స్క్రిప్ట్ సిద్ధమైందని ఆయన తెలిపారు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హైదరాబాద్లోని ఓ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొని సీక్వెల్ స్క్రిప్ట్ను హనుమంతుడి విగ్రహం ముందు ఉంచారు. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తనకు లభించదని అన్నారు. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రశాంత్ వర్మ తెలిపారు. కాగా ‘హను-మాన్’ సక్సెస్ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘జై హనుమాన్’ చిత్రంలో ఆంజనేయుడి పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తాడని, ఈ సినిమాను 2025లో విడుదల చేస్తామని ప్రశాంత్వర్మ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

