Amitgabh Uunchai |ఇవాళ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 80 వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన నటించిన చిత్రం ‘ఉంఛై’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన తన ట్విట్టర్ వేదిక ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 11న అమిత్ శ్రీవాత్సవగా వచ్చి మీ అందర్నీ కలుస్తానని ట్విట్టర్లో రాశారు.
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన 79 ఏండ్ల వయస్సులో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వర్ధమాన నటులకు స్ఫూర్తిగా నిలుస్తూ బ్లాక్ బస్టర్ సినిమాలతో సినీ ప్రియులను అలరిస్తున్నారు. తాను నటించిన తదుపరి చిత్రం ‘ఉంఛై’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించారు. తన పాత్రను కూడా ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు.
‘ఇది రాజశ్రీ ఫిలిమ్స్ అందిస్తున్న ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. 11-11-2022 నాడు అమిత్ శ్రీవాత్సవగా వస్తున్న నన్ను కలుసుకోండి. ఈ సినిమాకు సూరజ్ భర్జాత్యా దర్శకత్వం వహించారు. సినిమా విడుదల డేట్‌ను సేవ్ చేసుకోండి’ అని అమితాబ్ బచ్చన్ రాశారు. కాగా, షోలే సినిమా జోడీ అయిన ధర్మేంద్ర ట్విట్టర్ వేదికగా తామిద్దరు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి అమితాబ్ బచ్చన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.