Committee Kurrollu | టాలీవుడ్ యువ నటులు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా వచ్చిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించగా.. నిహారిక కొణిదెల సమర్పణలో… పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 9న రిలీజై మంచి విజయం సాధించింది. ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ అప్డేట్ను పంచుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గోదావరి జిల్లాల్లో పురుషోత్తంపల్లి అనే గ్రామంలో జరిగే భరింకాళమ్మతల్లి జాతరకు దానిలో భాగంగా చేసే బలి చేటకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. అయితే ఈ జాతర జరిగే క్రమంలో ఆ ఊరిలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. దీంతో ఈ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటి చేసేందుకు ఊరి కుర్రాళ్లలో ఒకడైన శివ (సందీప్ సరోజ్) ముందుకొస్తాడు. అయితే శివ ఎన్నికలలో నిలబడిన అనంతరం ఏం జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? భరింకాళమ్మతల్లి జాతరకు శివకు సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ 11 మంది కొత్త కమిటీ కుర్రోళ్లు సెప్టెంబర్ లోనే రాబోతున్నారు..
మన కమిటీ కుర్రోళ్లు బయదెల్లిపోయేరు…@PinkElephant_P @IamNiharikaK
Say hello to #CommitteeKurrollu pic.twitter.com/hO08KLScxg— ETV Win (@etvwin) August 30, 2024
సందీప్ సరోజ్, యస్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ రాధ్యా, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి నాగుమంత్రి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.