Heroines| ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమ బాలీవుడ్‌తో పోటీ పడుతుంది. ఇక్కడి దర్శక నిర్మాతలకి హీరో, హీరోయిన్స్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు వారితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ టెక్నీషియన్స్ పోటీ పడుతున్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రియులు సౌత్ స్టార్స్ గురించి ఆరాలు తీస్తున్నారు. వారు ఏం చదివారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో, దక్షిణ భారత సినిమాల్లోని ప్రముఖ నటీమణులలో అత్యంత చదువుకున్న నటీమణులు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి.
ప్రేమమ్ చిత్రంతో మలయాళ సినిమాలో నటించిన సాయి పల్లవి దక్షిణ భారత సినిమా అభిమానులను కూడా ఆకర్షించింది. ఆతర్వాత తెలుగులోకి ఫిదా సినిమాతో అడుగుపెట్టి ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు కోయంబత్తూరులో పాఠశాల విద్యను పూర్తి చేసింది . జార్జియాలో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి, సినిమా పట్ల ఉన్న మక్కువతో ఇండస్ట్రీకి వచ్చింది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిన రష్మిక బెంగళూరులో ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం అలాగే ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
నటి ఐశ్వర్య లక్ష్మి 2019లో విశాల్ నటించిన యాక్షన్ చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయింది. ఈ సినిమాతో అమ్మడికి పెద్దగా ఆఫర్స్ రాకపోయిన , 2021లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన జగమే తంతిరం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు మెడిసిన్ చదివిందన్న విషయం చాలా మంది అభిమానులకు తెలియదు. ఇక సమంత విషయానికి వస్తే తన గ్రాడ్యుయేషన్ స్టెల్లా మారిస్ కాలేజీ, చెన్నైలో కమర్స్ డిగ్రీతో పూర్తిచేశారు. తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఇక శ్రీలీల ముంబయిలోని ఒక ప్రముఖ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. లక్ష్మీ మంచు ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ నుండి థియేటర్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది.రెజీనా కసాండ్రా మానసిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఇలా పలువురు భామలు మంచి చదువు చదివి సినిమాపై మక్కువతో ఇండస్ట్రీకి వచ్చారు.