Pawan Kalyan | రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు పవన్‌కల్యాణ్. సుజిత్ దర్శకత్వలో ఆయన నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం షూటింగ్ రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఎన్నికల వేడి కారణంగా ఆ సినిమాకు ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చారు పవన్‌కల్యాణ్. ఈ సినిమా విషయంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటికప్పుడు అభిమానులకోసం ఆసక్తికరమైన అప్డేట్స్ ఇస్తూనేవుంది.
అనుకోకుండా ఎదురైన ఈ బ్రేక్ గురించి కూడా అభిమానులకు ఓ అప్డేట్ ఇచ్చింది డీవీవీ సంస్థ. ‘ఫ్యాన్స్ ఎప్పుడూ ఆకలిగానే ఉంటారు. అందుకే వారికి మేం చెప్పొచ్చేదేంటంటే.. ప్రస్తుతానికి ఎలాంటి షూటింగూ చేయడం లేదు. ఇప్పట్లో ఆప్డేట్లిచ్చే పరిస్థితీ లేదు. అందుకే.. ఎవరూ కొత్త ఆప్డేట్లను ఆశించవద్దు..’ అంటూ ఉన్న విషయాన్ని క్లుప్తంగా ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలిపింది డీవీవీ సంస్థ. ఎన్నికల వేడి చల్లారాక, మళ్లీ పవర్‌స్టార్ షూటింగ్‌ల వేడి మొదలవుతుందన్నమాట.