Pawan Kalyan – OG Movie | రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుజిత్ సైన్. ఇతడి దర్శకత్వంలో పవన్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా.. ఇటీవలే మళ్లీ షూటింగ్ ప్రారంభించింది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా అభిమానులను అలరించాయి. ఇదిలావుంటే నేడు సుజీత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓజీ నుంచి స్పెషల్ వీడియోను పంచుకుంది డీవీవీ ఎంటర్టైనమెంట్స్. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి.
ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఒమీ భావు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.