తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల-2’. 2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్ ఇది. అశోక్‌తేజ దర్శకుడు. సంపత్‌నంది టీమ్ వర్క్స్ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 22న కుంభమేళాలో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో తమన్నా నాగసాధు పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని, తమన్నా పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుందని, థ్రిల్లింగ్ డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం పేర్కొంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, దర్శకత్వం: అశోక్‌తేజ.