వివ రెడ్డి, రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకుడు. లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాత. డాక్టర్ కె.వి.రమణాచారి ఆశీస్సులతో ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. రమణాచారి మాట్లాడుతూ ‘కుటుంబ విలువలతో రూపొందిన చిత్రమిది. ఆస్తులపై ఉన్న ప్రేమ తమపై లేకపోవడం తల్లిదండ్రుల్ని ఎంత క్షోభకు గురిచేస్తుందో ఈ సినిమాలో చూపించారు.
ఇందులో కొడుకుగా వివ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. అతని పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగేలా ఉంటుంది. ఓ మంచి కుటుంబ కథాచిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. కునాల్, కుషాల్, చిత్రం బాషా, అనురాధ, రారాజు, సురభి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచన: రాజేంద్రరాజు కాంచనపల్లి, కెమెరా: సురేష్ చెటిపల్లి, సంగీతం: మధు బాపుశాస్త్రి.