NTR30 Movie | నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘NTR30’. ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. కాగా ఆర్ఆర్ఆర్ వచ్చి దాదాపు పది నెలలు దాటింది. అయినా ఇంకా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయకపోవడంపై అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. పైగా సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా ఏవి రాకపోవడంతో చిత్రబృందంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇదే నెలలో ఉండనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్ షూటింగ్ మార్చి థర్డ్ వీక్ నుండి ఉండనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అండర్ వాటర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందట. ప్రతీ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే కొరటాల.. ఈ సినిమాలో కూడా వాటర్‌కు సంబంధించిన సోషల్ మెసేజ్‌ను ప్రేక్షకులకు ఇవ్వనున్నాడట. ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.