ప్రస్తుతం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఎన్టీఆర్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్)కి సంబంధించిన నైట్ షెడ్యూల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ చేసే పోరాటల విషయంలో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. బాలీవుడ్ మీడియాలో ఈ విషయంపై కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక విషయంలోకెళ్తే.. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ డూప్ లేకుండా భయంకరమైన రిస్కీ ఫైట్స్ చేస్తున్నారట. నిజానికి ఇలాంటి పోరాటాలకు చెందిన సీన్స్ తీసేటప్పుడు బాడీ డబుల్స్ని వాడుతుంటారు.
కానీ ఎన్టీఆర్ డూప్ లేకుండా, బాడీడబుల్స్తో పనిలేకుండా స్వయంగా తానే ఈ ఫైట్స్ చేస్తున్నట్టు సమాచారం. బాడీ డబుల్స్ రోజులు ముగిశాయని, అభిమానుల కోసం తానెంత రిస్కీ ఫైట్స్ అయినా చేస్తానని ఎన్టీఆర్ చిత్రబృందంతో చెప్పినట్టు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ విషయం గురించి తన భార్యాపిల్లలకు మాత్రం తారక్ చెప్పలేదట.