NTR | టాలీవుడ్ సినీ ప్రేక్షకులు తమ అభిమాన హీరోల వారసులు ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదుగో అదుగో అంటున్నారే తప్ప క్లారిటీ రావడం లేదు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తనయుడు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు అనే వార్త నెట్టింట వైరల్గా మారింది.స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ రెండు దశాబ్ధాల కెరీర్ లో అంచెలంచెలుగా ఎదిగి నేడు గ్లోబల్ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
వార్ 2తో ఇప్పుడు బాలీవుడ్లోకి డైరెక్ట్ గా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా హిందీ ప్రేక్షకులకి మంచి ట్రీట్ అందించడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్రేజీ యాక్షన్ మూవీ కోసం ఎన్టీఆర్ స్లిమ్ లుక్ లో మారాడు. అయితే తాజాగా ఎన్టీఆర్కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు అభయ్ రామ్ మీద చేయి వేసి ఎయిర్ పోర్ట్లో నడుచుకుంటూ వస్తున్నాడు.. అభయ్ లుక్ ఎన్టీఆర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. అభయ్ వయసు 12 కాగా, మరో నాలుగైదేళ్లలో అతడు కూడా టీనేజీ ప్రేమకథల్లో నటించేస్తాడా అంటూ చర్చ నడుస్తుంది.
ఒకవైపు స్టడీస్ కొనసాగిస్తూ అడపాదడపా సినిమాలు చేసే ఛాన్స్ ఉందా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. మాస్టర్ అభయ్ రామ్..ఎన్టీఆర్ లా స్టైలిష్ గా చరిష్మాటిక్ గా ఉన్నాడు. ఎన్టీఆర్ లెగసీని నడిపించే మూడో తరం నటవారసుడిగా అభయ్ బరిలో దిగితే బాక్సాఫీస్ బద్దులు అవ్వడం ఖాయం అని నందమూరి అభిమానులు అంటున్నారు. విశ్వ విఖ్యాత నవరసనటసార్వభౌముడు ఎన్టీఆర్ కుటుంబం నుంచి పలువురు నటవారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, అన్నగారి వారసుడిగా నందమూరి బాలకృష్ణ అద్భుతమైన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆ తర్వాతి జనరేషన్ లో ఉన్న ఏకైక ఆశాదీపం జూనియర్ ఎన్టీఆర్ అని చాలా మంది అంటున్నారు. మరి నెక్ట్స్ తరంలో అభయ్ రామ్ రచ్చ చేస్తాడా లేదా అనేది చూడాలి.