యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్నారు. చిత్రానికి సంబంధించి రెండు సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా, వాటిలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లారు. అయితే అక్టోబర్13న వెండితెరపై సందడి చేయనున్న ఈ ఇద్దరు హీరోలు అంతకముందు బుల్లితెరపై వినోదం పంచనున్నారట.
వెండితెర అయిన బుల్లితెర చెలరేగిపోయే ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో ను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ షో కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ఇప్పటికే షూట్ చేశారు. ఆగస్టులో టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15, అందులోను ఆదివారం రావడంతో ఆ రోజున మొదటి ఎపిసోడ్ ను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.
తొలి ఎపిసోడ్లో హాట్ సీట్లో రామ్ చరణ్‌తో ఎన్టీఆర్ సందడి చేయనున్నట్టు తెలుస్తుండగా, వీరిద్దరి మధ్య గేమ్ షో చాలా ఆసక్తికరంగా సాగినట్టు తెలుస్తుంది. చరణ్ తాను సంపాదించిన మొత్తాన్ని వెల్వేర్కి డోనేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే షోకి సంబంధించి పలు ప్రోమోలు విడుదల కాగా, ఈ రోజో లేదంటే రేపో టెలికాస్ట్ డేట్‌కి సంబంధించిన ప్రోమో రానున్నట్టు తెలుస్తుంది. గతంలో నాగార్జున మరియు చిరంజీవిలు చేసిన మీలో ఎవరు కోటీశ్వరులు షో కు ఆశించిన స్థాయిలో రేటింగ్ రాకపోవడంతో ఇప్పుడు నిర్వాహకులు ఎన్టీఆర్‌ని నమ్ముకున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!