NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవర సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ (PrashanthNeel)తో తారక్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel గా రానున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.
ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తారక్ ఈ షూటింగ్లో పాల్గోనబోతున్నట్లు సమాచారం. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను సంక్రాంతి కానుకగా 2025 జనవరిలో రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. మరి మేకర్స్ ప్రచారం జరుగుతున్నట్టుగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేశారా? లేదంటే మరేదైనా కొత్త టైటిల్ ని పెట్టబోతున్నారా ? అనే విషయం తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
మరోవైపు ఈ మూవీలో ‘సప్త సాగరాలు దాటి’ చిత్రం హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కథానాయికగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ మూవీని ఒకటే పార్ట్‌లో ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 09 2026లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.