JR NTR | అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ఫొటోను పంచుకుంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ కొత్త స్టైల్ కోసం హెయిర్ స్టైలిష్ట్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పర్యవేక్షించడం చూడవచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన లుక్‌లలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. మలయాళ స్టార్ నటుడు బీజు మీనన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
The beast mode is about to ignite again 🔥#NTRNEEL next schedule begins soon.
Man of Masses @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @TSeries pic.twitter.com/8KBZloMI7x
— #NTRNeel (@NTRNeelFilm) November 6, 2025