ఎన్టీఆర్ – ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పానిండియా సినిమా ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్)లో విద్యాబాలన్ కీలక పాత్ర పోషించనున్నదట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. ఈ కథలో పవర్ఫుల్ లేడీ పోలీస్ ఉన్నతాధికారి పాత్ర కీలకమట. ఆ పాత్ర కోసమే విద్యాబాలన్‌ని తీసుకున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్. సహజంగానే ప్రశాంత్‌నీల్ సినిమాల్లోని పాత్రలు చాలా శక్తివంతంగా ఉంటాయి.
మరి విద్యాబాలన్ పాత్రను ఆయన ఎలా డిజైన్ చేశారో? అనేది ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎన్టీఆర్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిపేలా ‘డ్రాగన్’ సినిమాను ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.