NTR | సామాన్యులకే కాదు సినీ సెలబ్రిటీలకి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఎప్పుడు సినిమా పూజా కార్యక్రమం జరపాలి, ఏ దర్శకుడితో చేస్తే హిట్ అవుతుంది, ఏ హీరోయిన్‌తో చేస్తే మనకు ఫెచింగ్ అవుతుంది వంటివి కొందరు హీరోలు చెక్ చేసుకుంటారు. అయితే దాదాపు సినీ సెలబ్రిటీలకి సెంటిమెంట్ అనేది తప్పక ఉంటుంది. అయితే ఇప్పుడు తారక్ నటించిన వార్ 2 చిత్రం హిందీలో రిలీజ్ అవతున్న సమయంలో కొత్త సెంటిమెంట్ బయటకు వచ్చింది. గతంలో టాలీవుడ్ నుండి పలువురు హీరోలు హిందీలో తమ సినిమాలని రిలీజ్ చేసిన ఫలితాన్ని దక్కించుకోలేదు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పరిస్థితి ఏంటని ముచ్చటించుకుంటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయిక .అపూర్వ లాఖియా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ టైటిల్ తో విడుదల చేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం రెండుచోట్లా ఒకే ఫలితం చవి చూసింది. దీంతో చరణ్ కి బాలీవుడ్ నుంచి తొలి సినిమాతోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇక యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసాడు. వి.వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా భారీ హైప్ తో రిలీజ్ అయిన బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇక పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్న ప్రభాస్ .. హిందీ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి ఆదిపురుష్ చేశాడు. ఈ చిత్రం తెలుగు, హిందీలో విడుదల కాగా ఫ్లాప్‌గా నిలిచింది.
ఈ క్రమంలో మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో ప్రయత్నం చేసేందుకు అంత ఆసక్తి చూడం లేదు. అయితే ఇప్పుడీ వైఫల్యాల పరంపర యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. తారక్ వార్ 2`తో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం హిట్ అవుతుందా, లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. `వార్ ప్రాంచైజీలో భాగంగా వచ్చిన `వార్ 2`ని టాలీవుడ్ మార్కెట్ కోసం తారక్ ని రంగంలోకి దించి చేసారు. అయితే చరణ్, ప్రభాస్ ల బాలీవుడ్ వైఫల్యం చెందగా, ఇప్పుడు అదే బాటలో తారక్ పయనిస్తాడా అనేది చూడాలి.