అగ్ర హీరో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కి చెందిన వివరాలు కూడా వెలుగు చూశాయి. త్వరలో మొదలుకానున్న ఈ భారీ షెడ్యూల్లో ఓ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌ని ఎన్టీఆర్‌పై చిత్రీకరించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
అలాగే ఓ పాటను కూడా ఈ షెడ్యూల్లోనే షూట్ చేస్తారట. వీటితోపాటు కథలోని కీలక ఎపిసోడ్‌ని శ్రీలంకలో చిత్రీకరిస్తారట. దీంతో ఈ షెడ్యూల్‌తోపాటు సినిమా కూడా మూడొంతులు పూర్తవుతుందని సమాచారం. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.