మెగా-నందమూరి అభిమానులకి మాంచి కిక్ ఇచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. చిరంజీవి, బాలయ్య కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కాని కుదరలేదు. వారి ఫ్యామిలీస్ నుండి వచ్చిన రామ్ చరణ్- ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకులకి మంచి వినోదం పంచారు.దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన పాన్ ఇండియన్ సినిమా RRR కాగా, ఈ చిత్రం అనేక రికార్డులు సాధించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పోరాట యోధుల పాత్రల్లో నటించడం.. అలాగే, బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ లాంటి క్రేజీ స్టార్స్ నటించి ఉండటంతో ఈ మూవీకి అసాధారణమైన బజ్ ఏర్పడింది.
చిత్రం విడుదలై భారీ విజయం సాధించి దాదాపు రూ.1100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అయితే తాజాగా లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు. దీనికోసం రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై సందడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేదికపై ఎన్టీఆర్ – రామ్ చరణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఆత్మీయ ఆలింగనంతో పాటు రామ్ చరణ్.. ఎన్టీఆర్ కి ముద్దు పెట్టడం హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికి మరిచిపోలేను. అయితే చరణ్ వాళ్ల ఫాదర్ చిరంజీవి ఎంత గొప్ప డ్యాన్సరో మనందరికి తెలుసు. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్. వీరిద్దరు కలిసి నాటు నాటుకి డ్యాన్స్ చేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుందని ఎన్టీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చిరు, బాలయ్య కలిసి సినిమా చేయకపోయిన కనీసం ఇలా ఓ పాటకి కలిసి డ్యాన్స్ చేసిన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.
. @tarak9999 about RC, chiru and Nbk 🔥 pic.twitter.com/TspkMNcgjf
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) May 11, 2025