Kota Srinivasa Rao | ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం కోట శ్రీనివాసరావు మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు నటనా ప్రతిభను కొనియాడుతూ, ఆయనతో తన అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.
కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం. ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ఎన్టీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు గారు తెలుగు చిత్రసీమకు అందించిన సేవలను, ఆయన పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలను ఎన్టీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు.
నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ…— Jr NTR (@tarak9999) July 13, 2025