NTR | ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన వార్ 2 చిత్రం నేడు గ్రాండ్‌గా విడుదలై, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కథలో కొత్తదనం తక్కువగానే ఉన్నా, భారీ స్థాయిలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకుల అభిప్రాయం. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) స్పై సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు మంచి వినోదం పంచుతుంది.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో అందరి హీరోలతో సోలోగా, మల్టీస్టారర్ గా సినిమాలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే టైగర్ (సల్మాన్ ఖాన్), పఠాన్ (షారుక్ ఖాన్), కబీర్ (హృతిక్) పలు సినిమాలు వచ్చాయి. త్వరలో మరిన్ని సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో సోలో గా చేసిన హీరోలు వేరే సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్‌లు ఇస్తారు. అయితే ఎన్టీఆర్ వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ చేయడంతో ఇప్పుడు సోలో సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తుంది.. గతంలోనే ఎన్టీఆర్ సోలోగా ఈ స్పై యూనివర్స్ లో సినిమా ఉంటుందని జోరుగా ప్రచారాలు జరగడం మనం చూశాం.
వార్ 2లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించడంతో పాటు, రాఘవ అనే పేరుతో, ఏజెంట్ విక్రమ్‌గా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఓ డైలాగ్ ..”దేశం కోసం ఒక టైగర్ వచ్చాడు, ఒక పఠాన్ వచ్చాడు, ఒక కబీర్ వచ్చాడు… రేపు ఓ రాఘవ కూడా రాగలడు”అని చెప్పడం, అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపింది. ఈ డైలాగ్‌తో పాటు ఎన్టీఆర్ పాత్రకు ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి చూస్తే, ఎన్టీఆర్‌కు సోలో స్పై మూవీ ఖచ్చితంగా రానుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటికే “విక్రమ్, లేక రాఘవ అనే టైటిల్‌తో ఎన్టీఆర్ స్పై మూవీ వచ్చే అవకాశం ఉంది” అంటూ చర్చలు ప్రారంభించారు.