EMహిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన కౌన్ బనేగా కార్యక్రమాన్ని తెలుగులో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఆగస్ట్ 22న మొదలు కాగా, రాత్రి 8.30ని.లకు ప్రసారం అయింది. ఈ షోకి చీష్ గెస్ట్‌గా రామ్ చరణ్ హాజరు కాగా, హోస్ట్‌గా ఎన్టీఆర్ ఉన్నారు. ముందుగా షోకి సంబంధించిన రూల్స్ తెలియజేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత చరణ్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నాడు.
ఆచార్య చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది అంటూ రామ్ చరణ్ ను ఎన్టీఆర్ అడగగా, నాన్న తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా మెమరబుల్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చారు. నా కోసం స్క్రిప్ట్‌ని ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు చరణ్. ఆ తర్వాత పవన్‌తో అనుబంధం గురించి ప్రస్తావిస్తూ ఆయన నాకు ఫ్రెండ్, బాబాయి, చిన్న నాన్న. మమ్మల్ని చిన్నప్పుడు చాలా బాగా చూసుకున్నారు అని చెప్పుకొచ్చాడు.
ఇక రామ్ చరణ్ లో దాగి ఉన్నఫొటోగ్రాఫర్ గురించి కూడా ప్రస్తావించాడు ఎన్టీఆర్ . రామ్ చరణ్ తీసిన కొన్ని ఫోటోలు నేను చూశాను.రామ్ చరణ్ లో నాకు తెలియని ఇంత టాలెంట్ దాగి ఉంటుందని ఊహించలేదు. చరణ్‌తో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయనలో దాగి ఉన్న టాలెంట్ నాకు తెలిసింది అని ” ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమాతో వెండితెరపై సందడి చేయనున్న విషయం తెలిసిందే.