Cinema News | ఎన్టీఆర్, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కలిసి మాట్లాడుకోవడం.. వీరిద్దరూ కలిసున్న స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. నిజానిక్కూడా ఇది షాకింగ్ కాంబినేషనే. వీరిద్దరూ కలిసి పనిచేస్తే.. అనే ఊహకే గూజ్బంప్స్ వచ్చేస్తాయి. నటుడిగా ఎన్టీఆర్ ఏంటో.. దర్శకుడిగా సందీప్‌రెడ్డి వంగా శైలి ఏమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరూ కలిస్తే ఆ సినిమా ‘యానిమల్’ కాదు, ‘డైనోసారే’ అవుతుందనేది చాలామంది అభిప్రాయం.
నిజానికి వీరిద్దరూ చాలా బిజీ. తారక్ ‘దేవర-1’ ఈ నెల 27న విడుదల కానుంది. మరోవైపు ఆయన బాలీవుడ్లో ‘వార్-2’ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రశాంత్‌నీల్ సినిమా ఉండనేవుంది. ఆ తర్వాత ‘దేవర- 2’.. ఇలా క్షణం తీరిక లేకుండా కెరీర్ సాగిస్తున్నారు తారక్. సందీప్‌రెడ్డి వంగా కెరీర్ కూడా ఇంచుమించూ అలాగే ఉంది. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.
షూటింగ్‌ని నిరవధికంగా ఏడాదిపాటు ప్లాన్ చేశారట. పైగా ప్రభాస్‌ని కూడా ఏడాది డేట్లు అడిగారని బాలీవుడ్ టాక్. మరోవైపు ‘యానిమల్ సీక్వెల్’ ఉండనే ఉంది. ఇవిగాక పైప్‌లైన్‌లో సందీప్‌కి చాలా కమిట్మెంట్లున్నాయి. మరి వీరిద్దరూ కలిసేదెప్పుడు? సినిమా చేసేదెప్పుడు? సినిమా పరిశ్రమలో ఏమైనా జరగొచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు..