NTR | అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల పూర్తయిన షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. ఈ నెల 20 నుంచి మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారని తెలిసింది. ఇదిలావుండగా ‘వార్-2’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆయన బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా నవంబర్ నెలాఖరులో సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.
తొలి షెడ్యూల్లో ఎన్టీఆర్-హృతిక్ రోషన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలిసింది. ఈ సినిమా కథ గురించి కూడా బాలీవుడ్లో ఆసక్తికరమైన సమాచారం బయటికొచ్చింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే వారి మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుందన్నదే ఈ చిత్ర కథాంశమని చెబుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా తెరకెక్కించబోతున్నారు.