శనివారం 06 జూన్ 2020
Cinema - May 03, 2020 , 15:38:31

ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, అల్లు అర్జున్..!

ఒకే ఫ్రేములో ఎన్టీఆర్, అల్లు అర్జున్..!

లాక్‌డౌన్ వ‌ల‌న సినిమాలు లేక‌పోయే స‌రికి సినీ ప్రేక్ష‌కులు వారి అభిమాన స్టార్స్ సోష‌ల్ మీడియాని రెగ్యుల‌ర్‌గా ఫాలో అవుతూ వ‌స్తున్నారు. ఎప్పుడెప్పుడు ఏమేం స‌ర్‌ప్రైజ్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్‌ తాజాగా పాత ఫోటోని షేర్ చేస్తూ గ‌తాన్ని గుర్తు  చేసుకుంది. ఇందులో స్టార్ హీరోస్ అల్లు అర్జున్ , ఎన్టీఆర్‌ల‌తో పాటు కాజ‌ల్‌, అమ‌లాపాల్ ,పూరీ జ‌గ‌న్నాథ్‌, శ్రీను వైట్ల ఉన్నారు.

బార్సిలోనాలో  బాద్షా, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో  అలా అందరం కలిసాం అంటూ ఓ ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేసింది కాజల్. ఫారెన్ లొకేషన్‌లో అంద‌రు ఖుషీ ఖుషీగా కనిపిస్తున్నారు.  మళ్ళీ మీ అందరినీ కలవాలని ఆతృతగా ఉందని త‌న పోస్ట్‌లో తెలిపింది కాజల్. 2013లో ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో  బాద్షా తెర‌కెక్క‌గా ఈ  సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. అదే ఏడాది అల్లు అర్జున్, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా 'ఇద్దరమ్మాయిలతో' సినిమా రూపొందించారు పూరి జగన్నాథ్. ఆ రెండు సినిమాల షూటింగ్‌లు ఫారెన్ లొకేషన్ బార్సిలోనాలో జ‌రిగిన స‌మ‌యంలో దిగిన ఫోటో ఇది.  నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.


logo